రైతే భగీరథుడు | - | Sakshi
Sakshi News home page

రైతే భగీరథుడు

Feb 27 2026 7:28 AM | Updated on Feb 27 2026 7:28 AM

రైతే

రైతే భగీరథుడు

కొండంత పట్టుదలతో గిరి రైతు విజయం

విధి వెక్కిరించినా.. వనరులు సహకరించకపోయినా ఆ రైతు వెనకడుగు వేయలేదు. ఆకాశం నుంచి వాన కురవకపోయినా, కాలువ నుంచి నీరు రాకపోయినా.. వృథాగా పోతున్న నీటి చుక్కనే తన పొలానికి ప్రాణధారగా మార్చుకున్నాడు. పెదబయలు

మండలానికి చెందిన గొలిసింగి సింహాచలం అనే రైతు, ఆధునిక భగీరథుడిలా మారి పైపుల ద్వారా నీటిని మళ్లించి సాగు చేపట్టి సాటి రైతులకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడు.

కల్వర్టు నుంచి వచ్చే వృథానీటిని తరలించేందుకు అమర్చిన పైపులు

వృథా నీటిని పైరుకు ప్రాణధారగా

మార్చుకున్న రైతు

సింహాచలం

పెదబయలు: సాధారణంగా సాగునీరు అందకపోతే ఏ రైతు అయినా నిరాశతో సాగు విరమించుకుంటాడు. కానీ మండలానికి చెందిన ఆ రైతు మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ఆలోచించాడు. వృథాగా పోతున్న నీటిని ఒడిసి పట్టి, తన పొలానికి ప్రాణం పోశాడు. వివరాల్లోకి వెళ్తే.. గుల్లేలు పంచాయతీ చీమకొండ గ్రామానికి చెందిన గొలిసింగి సింహాచలం అనే రైతుకు ఎకరంన్నర పొలం ఉంది. ఖరీఫ్‌లో వరి పండించిన ఆయన, రబీలోనూ సాగు చేయాలని సంకల్పించారు. అయితే, పొలానికి నీరు అందే మార్గం లేకపోవడంతో సాగు ప్రశ్నార్థకంగా మారింది.

ేుధస్సుకు పదును.. పైపులతో సాగు

చుట్టూ నీరున్నా తన పొలానికి రావడం లేదని ఆయన కుంగిపోలేదు. తన మేధస్సుకు పదును పెట్టి, కొంత దూరంలో ఉన్న గెడ్డ కల్వర్టు నుంచి వృథాగా పోతున్న నీటిని గమనించారు. సుమారు 100 మీటర్ల పొడవైన ప్లాస్టిక్‌ పైపులను సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు.కల్వర్టు నుంచి తన పొలం వరకు ఆ పైపుల ద్వారా నీటిని మళ్లించారు.ప్రస్తుతం ఆ నీటితోనే తన ఎకరంన్నర పొలంలో వరి నాట్లు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు వృథాగా పోతుంటే చూడలేకపోయాను. అందుకే పైపుల ద్వారా నీటిని తెచ్చుకున్నాను అని తన ఆవేదనను, ఆనందాన్ని పంచుకున్నారు. అయితే, ఇక్కడ శాశ్వత పరిష్కారం కోసం ఒక చెక్‌ డ్యామ్‌ నిర్మించాలని సింహాచలంతో పాటు గ్రామ రైతులు కోరుతున్నారు. చిన్నపాటి సాయం అందిస్తే మరిన్ని ఎకరాలకు సాగునీరు అందుతుందని వారు ఆశిస్తున్నారు.అధికారులు స్పందించి అక్కడ చెక్‌ డ్యామ్‌ నిర్మిస్తే, సింహాచలం లాంటి ఎంతోమంది రైతుల కష్టం ఫలిస్తుంది. కేవలం పైపులతోనే పంట పండిస్తున్న ఈ రైతు పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకం.

పైపుల ద్వారా పొలానికి మళ్లించిన వృథా నీరు

వృథా నీటితో చేపట్టిన వరి సాగు

రైతే భగీరథుడు 1
1/2

రైతే భగీరథుడు

రైతే భగీరథుడు 2
2/2

రైతే భగీరథుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement