తప్పుడు తూకాలతోమోసం చేస్తే కఠిన చర్యలు
● లీగల్ మెట్రాలజీ అధికారి రాజేష్
పాడేరు రూరల్: తప్పుడు తూకాలతో గిరిజనులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ కె. రాజేష్ హెచ్చరించారు. గురువారం గుత్తులపుట్టు వారపు సంతలో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి మొత్తం 14 కేసులు నమోదు చేశారు.యంత్రాలలో లొసుగులను ఉపయోగించి గిరిజనులను మోసం చేస్తున్న వారిపై 6 కేసులు, తూనిక యంత్రాలపై ప్రభుత్వ ముద్రలు లేకుండా ఉపయోగిస్తున్న వ్యాపారులపై 5 కేసులు నమోదు చేశారు. వాటర్ బాటిళ్లను గరిష్ట ధర కంటే ఎక్కువకు విక్రయిస్తున్న వారిపై మూడు కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో అధికారులు దామోదర్, అనురాధ, సిబ్బంది పాల్గొన్నారు.


