సందడిగా జిల్లా స్థాయి గుర్రపు పరుగు పోటీలు
మునగపాక: కనుమ పండుగ సందర్భంగా మునగపాకలో జిల్లా స్థాయి గుర్రపు పరుగు పోటీలను శుక్రవారం నిర్వహించారు. ఈ పోటీలన తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. శ్రీరామ అభయాంజనేయ స్వామి తీర్థ మహోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన గుర్రపు పరుగు పోటీలను వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ ప్రారంభించి బహుమతులు అందజేశారు. గుర్రపు పరుగు పోటీల్లో చోడమాంబిత గుర్రానికి ప్రథమ బహుమతి దక్కింది. సిద్ధి వినాయక సాయిశ్రీజ, దాడి కోటేశ్వరరావు, మోదమాంబ శివతేజ, దాడి నూక హనుమంతరావు గుర్రాలకు ద్వితీయ, తృతీయ, చతుర్ధ, పంచమ బహుమతులు లభించాయి.
సందడిగా జిల్లా స్థాయి గుర్రపు పరుగు పోటీలు


