వైభవంగా మకరజ్యోతి సంబరాలు
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి, గాయకుడు మనోను సన్మానిస్తున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం: స్వామి అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిర్వహించిన మకరజ్యోతి మహోత్సవాలు అంబరాన్ని తాకాయి. ఆలయం నుంచి ప్రారంభమైన స్వామి వారి రథయాత్ర పట్టణ పురవీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా నర్సీపట్నంలోని ఎన్టీఆర్ మినీస్టేడియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి, గాయకుడు మనో తమ పాటలతో అలరించారు. కోటి, మనో, యూపీ అడిషనల్ డీఐజీ సత్యనారాయణ, సత్యసాయి జిల్లా జేసీ భరద్వాజ్, గాయకుడు ధీరజ్, గజల్ శ్రీనివాస్ బృందంను కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రడు, ఎంపీ సి.ఎం.రమేష్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వైభవంగా మకరజ్యోతి సంబరాలు


