ఎం. అలమండలో అగ్ని ప్రమాదం
● గ్యాస్‌స్టౌపై పిండి వంటలు చేస్తుండగా చెలరేగిన మంటలు ● రూ. 3.50 లక్షల ఆస్తి నష్టం
ప్రమాదంపై స్థానికులను ఆరా తీస్తున్న పోలీసులు
దేవరాపల్లి: మండలంలోని ఎం. అలమండలో గురువారం అగ్ని ప్రమాదం జరిగి, రూ.3.50 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన సిరపరపు స్వప్న గ్యాస్ స్టవ్‌పై పిండి వంటలు చేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఆమె, కుటుంబ సభ్యులు భయంతో పరుగులు తీశారు. ఇల్లు మొత్తం మంటలు వ్యాపించడంతో ఫర్నీచర్, గృహోపకరణాలు, ఇతర సామగ్రి కాలిబూడిదదయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు.
ఎం. అలమండలో అగ్ని ప్రమాదం


