అరకు అందాలకు కొత్తదారి
జాతీయ రహదారిలో నిర్మించిన అతిపెద్ద వంతెన
వంతెన పైనుంచి కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు
జాతీయ రహదారి 516ఈ నిర్మాణంలో భాగంగా డుంబ్రిగుడ మండలం అరకు సంతగ్రామాన్ని, అరకులోయ మండలం ఎండపల్లివలస రైల్వేస్టేషన్‌ను కలుపుతూ నిర్మించిన భారీ వంతెన అందుబాటులోకి వచ్చింది. సుమారు ఒక కిలోమీటరు పొడవు ఉన్న ఈ వంతెన వల్ల ప్రయాణ దూరం గణనీయంగా తగ్గింది. అరకులోయ పట్టణంలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా, బెంజిపూర్ నుంచి నేరుగా అరకు సంతకు చేరుకోవచ్చు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. చాపరాయి, పాడేరు, వంజంగి, లంబసింగి వంటి పర్యాటక ప్రాంతాలకు కేవలం ఒక గంటలోనే చేరుకునే అవకాశం కలిగింది. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలకు అనుమతి ఉంది. హైవే రోడ్డు అధికారికంగా పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడంతో బస్సులకు ఇంకా అనుమతి లభించలేదు. – డుంబ్రిగుడ
అరకు అందాలకు కొత్తదారి


