రెండు బైక్‌లు ఢీ.. యువకుడి మృతి
ముంచంగిపుట్టు: మండలంలోని వనభసింగి పంచాయతీలోని కొత్తూరు జంక్షన్ నుంచి పెదగూడ వెళ్లే మార్గంలో కొత్తూరు కల్వర్టు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. ఎస్‌ఐ నాని కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. టొంగికోట గ్రామానికి చెందిన యువకులు దేశియ అనిల్‌కుమార్, కరింగ్యా భరత్‌కుమార్ (17), తరుణ్‌కుమార్ ద్విచక్ర వాహనంపై కొత్తూరు వైపు వెళ్తున్నారు. అదే సమయంలో పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సెక్యూరిటీగా పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుళ్లు లక్ష్మణ్, రంజిత్ పాడేరు నుంచి పెదగూడ వైపు బైక్‌పై ఎదురుగా వస్తున్నారు. వీరి బైక్‌లు ఢీకొనడంతో భరత్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అనిల్‌కుమార్, తరణ్‌కుమార్‌తో పాటు కానిస్టేబుళ్లు రంజిత్,లక్ష్మణ్‌లకు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. వీరిని స్థానికులు హూటాహుటిన స్థానిక సీహెచ్‌సీకి తీసుకువచ్చారు. ప్రథమ చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి భరత్‌కుమార్‌ను విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్టు ఎస్‌ఐ తెలిపారు. రంజిత్, లక్ష్మణ్ హెల్మెట్ ధరించి ఉన్నారని, వీరిని కూడా విశాఖ కేజీహెచ్‌కు తరలించారని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. సంక్రాంతి పండగనాడు ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు గాయాలు పాలవడం, ఒకరు మృతి చెందడంతో టొంగికోటతో విషాదం నెలకొంది.
నలుగురికి గాయాలు
క్షతగాత్రుల్లో ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు
ఎస్‌ఐ నాని వెల్లడి
సంక్రాంతి పండగ నాడు
టొంగికోటలో విషాదం
రెండు బైక్‌లు ఢీ.. యువకుడి మృతి
రెండు బైక్‌లు ఢీ.. యువకుడి మృతి


