సీలేరులో 1.0 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి
● గోదావరి డెల్టాకు డొంకరాయి నుంచి 3 వేల క్యూసెక్కుల విడుదల
సీలేరు: స్థానిక జలవిద్యుత్ కేంద్రంలో నాలుగు యూనిట్ల ద్వారా గత పదిరోజులుగా రోజుకు 1.0 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరుగుతుందని ఈ కేంద్రం ఉన్నతాధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నాలుగు యూనిట్లు అందుబాటులో ఉన్నాయని లోడ్ డిస్పాచ్ అధికారుల ఆదేశాల మేరకు ఉత్పాదన జరుగుతోందని ఆయన తెలిపారు. ప్రస్తుతం పొల్లూరు, డొంకరాయిలో ఉత్పత్తి జరగడం లేదు. ఈనేపథ్యంలో సీలేరులో ఉత్పత్తి అనంతరం విడుదల అయ్యే నీరు డొంకరాయి జలాశయంలో చేరడంతో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి 1035 అడుగులు ఉంది. దీంతో మూడు గేట్ల ద్వారా మూడు వేల క్యూసెక్కులు గోదావరి డెల్టాకు విడుదల చేస్తున్నారు.


