
900 మద్యం సీసాలు పట్టివేత
● ఇద్దరు అరెస్టు, మినీ వ్యాన్ సీజ్
గూడెంకొత్తవీఽధి: మండల కేంద్రం గూడెంకొత్తవీధిలోని మద్యం షాపు నుంచి గ్రామాలకు తీసుకువెళ్తున్న 900 మద్యం సీసాలను పట్టుకున్నామని సీఐ వరప్రసాద్ మంగళవారం విలేకరులకు తెలిపారు. వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో అటుగా వస్తున్న మినీ వ్యాన్‌ను పరిశీలించగా మద్యం సీసాలు బయటపడ్డాయన్నారు. వ్యాన్‌ను సీజ్ చేశామమన్నారు.అక్రమంగా మద్యం తరలిస్తున్న గాలి రామరాజు, రాడా ప్రసాద్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని ఆయన వెల్లడించారు.