
పప్పన్నం లేనట్టే?
సాక్షి,పాడేరు: పేదల ఆహారభద్రతపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. రేషన్‌డిపోల ద్వారా కందిపప్పు పంపిణీ చేయకుండా చేతులెత్తేసింది. పేదలకు పప్పన్నాన్ని దూరం చేసింది. జిల్లాలో 83శాతం జనాభా ఉన్న గిరిజనులకు కూడా పౌష్టికాహారం కరువైంది. ఈఏడాది ఫిబ్రవరి నుంచి రేషన్‌కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేయడం లేదు. రాయితీపై కిలో రూ.70 ధరకు ప్రభుత్వం పేదలకు ప్రతినెలా పంపిణీ చేయాల్సి ఉంది. అయితే బియ్యం, పంచదార మాత్రమే అందుతోంది. కందిపప్పు కోసం ప్రశ్నిస్తే సరఫరా లేదంటూ డిపోల నిర్వహకులు చెబుతున్నారని గిరిజనులు తెలిపారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతినెలా కందిపప్పు పేదలకు సరఫరా అయ్యేది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచి పంపిణీ జరగడం లేదు.
● జిల్లాలోని 22 మండలాల పరిధిలో 2,98,092 రేషన్‌కార్డులు ఉన్నాయి. ప్రతినెలా సుమారు 290 టన్నుల వరకు కందిపప్పు పౌరసరఫరాలశాఖ జిల్లాకు సరఫరా చేయాల్సి ఉంది. పౌష్టికాహర వినియోగంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తుంటాయి. అయితే రేషన్‌కార్డుపై ప్రతి నెలా ఇచ్చే కిలో కందిపప్పు విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేయడం వల్ల గిరిజనుల పౌష్టికాహారంపై ప్రభావం చూపుతోంది.
● కందిపప్పు ప్రైవేట్ మార్కెట్లో కిలో రూ.120కు వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఈ ధరకు గిరిజనులు కొనలేక ఇబ్బందులు పడుతున్నారు. గిరిజన కుటుంబాలు సంతల్లో వారానికి పావు కిలో కందిపప్పును కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు.
సంక్రాంతి తరువాతపంపిణీ లేదు
సంక్రాంతి నెలలో కందిపప్పు పొందాం. ఆ తరు వాత నుంచి ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. ఈనెల కూడా బియ్యం, పంచదార మాత్రమే ఇచ్చారు. హుకుంపేట వారపుసంతలో ప్రతివారం కిలో కందిపప్పు రూ.130తో కొనుక్కుంటున్నాం. కందిపప్పు పంపిణీ చేయకపోవడం అన్యాయం.
– పాంగి బారుసో, ఆదివాసీ మహిళ,
గుర్రాలతోట, హుకుంపేట మండలం
పేదలకు ఆరు నెలలుగా అందని
కందిపప్పు
ప్రైవేట్ మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు
2,98,092 మంది కార్డుదారులకు నోచుకోని సరఫరా
రేషన్ డిపోల్లో పంచదార, బియ్యం
పంపిణీకి పరిమితం

పప్పన్నం లేనట్టే?

పప్పన్నం లేనట్టే?