మంచు.. ఎండ.. వాన
మూడు పూటలా భిన్నమైన వాతావరణం
సాక్షి,పాడేరు: జిల్లాలోని పలు ప్రాంతాల్లో వింత వాతావరణం నెలకొంటొంది. ఉదయం దట్టంగా పొగమంచు కురుస్తుండడంతో 8గంటల తరువాత సూర్యోదయం అవుతోంది.ఆ తరువాత సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. మధ్యాహ్నం 3గంటల తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం కురుస్తోంది. పాడేరుతో పాటు పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకూ తీవ్రంగా ఎండకాసి, అనంతరం వర్షం కురుస్తుండడతో ప్రజలు ఇబ్బందులకు పడుతున్నారు. జిల్లాలో పాడేరుతో పాటు పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం పడింది. భారీగా ఈదురు గాలులు వీచాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
మంచు.. ఎండ.. వాన
మంచు.. ఎండ.. వాన


