
ఇసుకకొండకు పోటెత్తిన భక్తులు
సత్యదేవుని ఆలయంలో పౌర్ణమి పూజలు
డాబాగార్డెన్స్ (విశాఖ): నగరంలోని ఇసుకకొండపై వెలసిన రమా సహిత సత్యనారాయణస్వామి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. బుద్ధ, వైశాఖ పౌర్ణమి సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు జరిపారు. వేకువజాము 4 గంటల నుంచే భక్తులు స్వామి దర్శనానికి బారులు తీరారు. నగరం నుంచే గాక ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి తరలివచ్చారు. ఆలయ మండపంలో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు జరిగాయి. ఆలయ కార్యనిర్వాహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షించారు. సాయంత్రం వరకు భక్తుల తాకిడి కనిపించింది. భక్తుల సౌకర్యార్థం సర్వదర్శనంతో పాటు రూ.20, రూ.200, రూ.300 టికెట్లు అందుబాటులో ఉంచారు. వేకువజాము 4 గంటలకు అనివెట్టి మండపం వద్ద సామూహిక వ్రతాలు, ప్రత్యేక పూజలు జరిపారు. ఉదయం 7 గంటల నుంచి ఆలయ మండపంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. వేసవి తీవ్రత దృష్ట్యా పెండాల్స్ ఏర్పాటు చేశారు.

ఇసుకకొండకు పోటెత్తిన భక్తులు