భూలక్ష్మీ, దుర్గ.. అయ్యో! వీళ్లకు ఎంత కష్టం వచ్చి పడింది | Fundraisers in India: Need Financial Help Support For The Treatment Of Kid | Sakshi
Sakshi News home page

భూలక్ష్మీ, దుర్గ.. అయ్యో! వీళ్లకు ఎంత కష్టం వచ్చి పడింది

Oct 30 2021 2:27 PM | Updated on Nov 2 2021 2:52 PM

Fundraiser India: Need Financial Help Support For The Treatment Of Kid - Sakshi

నా పేరు దుర్గ. చిన్న వయస్సులోనే పెళ్లి అయ్యింది. నా మొగుడు పచ్చి తాగుబోతు. ఏ పని చేయకుండా ఇంట్లో ఉండటమే కాదు, నేను పని చేస్తే వచ్చిన కొద్ది డబ్బులు కూడా తాగుడుకే తగలేసేవాడు. ఇంట్లో రోజు గొడవలే. పెళ్లి జరిగినప్పటి నుంచి ఇళ్లో నరకంలా మారింది. కానీ ఇన్ని కష్టాల్లో నాకు ఏ కొంత సంతోషమైనా ఉందంటే అది నా కూతురు భూలక్ష్మిని చూస్తే కలిగేది. తనకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఎంత కష్టమైనా సరే భరించాలి అనిపించేంది. 

భూలక్ష్మీ చదువు కోసం పక్కన పెట్టిన డబ్బులు కూడా తాగడానికి వాడుకోవడంతో నా భర్తను గట్టిగా నిలదీశాను. మళ్లీ గొడవైంది. ‘నువ్వు వద్దు, నీ కూతురు వద్దూ’ అంటూ నా భర్త నన్ను వదిలేసి వెళ్లాడు. అప్పటి నుంచి పాపే లోకంగా బతుకుతున్నాను. తను కూడా అంతే ఈ అమ్మ కష్టాలను అర్థం చేసుకుని మెలిగేది. తనని చూస్తే నాకు కొండంత ధైర్యం వచ్చేది. కొండంత కష్టాల మధ్య ఓదార్పు లభించేది.

ఓ రోజు పని ముగించుకుని ఇంటికి వచ్చే సరికి ఇంట్లో స్పృహ లేకుండా భూలక్ష్మీ పడిపోయి ఉంది. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇరుగుపొరుగు సాయంతో వెంటనే దగ్గర్లోని క్లినిక్‌కి తీసుకుపోయాను. వాళ్లు పెద్దాసుపత్రికి తీసుకెళ్లమన్నారు. భూలక్ష్మీ చదువు కోసం దాచుకున్న డబ్బంతా ఖర్చు చేశాను.. చివరకు అప్లాస్టిక్‌ ఎనిమీయా అనే ప్రాణాంతక క్యాన్సర్‌గా తేల్చారు. 

ఈ భయంకరమైన క్యాన్సర్‌ వల్ల భూలక్ష్మీకి ఎప్పటికప్పుడు రక్తం మార్పిడి చేయాల్సి వస్తోంది. ఏడాదిగా ఖర్చు గురించి ఆలోచించకుండా రక్తమార్పిడి చేయిస్తున్నాను, అయితే ఈ ఖర్చుల కోసం ఉన్న ఇంటిని, కొద్దొగొప్పొ ఉన్న పొలం అమ్మేశాను. అవి అమ్మగా వచ్చిన రూ.16 లక్షలు ఆస్పత్రి ఖర్చులకే సరిపోయాయి. ఇప్పటికీ  నా కూతురు ఆరోగ్యం మెరుగుపడలేదు

అప్లాస్టిక్‌ ఏనిమీయా క్యాన్సర్‌ చికిత్సకు బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్‌ ఖర్చు రూ. 30 లక్షలు అవుతుందన్నారు. బాధ్యత లేని భర్తతో ఎన్నో కష్టాలు పడ్డాను. ఒకప్పుడు ఆసరాగా ఉన్న ఇళ్లు, పొలం కూడా ఇప్పుడు నా దగ్గర లేవు. భూలక్ష్మీ ఆస్పత్రిలో ఉంటే నేను బయట వరండాలో ఉంటున్నాను. నా కూతురిని ఎలాగైనా బతికించుకోవాలని, ఆపరేషన్‌ చేయించాలని తెలిసినవారందరినీ ప్రాథేయపడ్డాను. చివరకు మెడికల్‌ ఎమర్జెన్సీలో ఫండ్‌ రైజింగ్‌ చేసే కెట్టో గురించి తెలిసింది. నా భూలక్ష్మీ ప్రాణాలు కాపాడేందుకు మీ సాయం కోరుతున్నాను. నా చిట్టి తల్లిని బతికించండి. 

సాయం చేయాలనుకునే వాళ్లు ఇక్కడ క్లిక్‌ చేయండి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 

పోల్