రోడ్డు భద్రతపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు భద్రతపై అవగాహన అవసరం

Nov 18 2026 12:02 AM | Updated on Nov 18 2026 12:02 AM

ఆదిలాబాద్‌టౌన్‌: విద్యార్థులు రోడ్డు భద్రత, మాదకద్రవ్యాలపై అవగాహన కలిగి ఉండాల ని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడ ప్రభుత్వ ఉన్నత పా ఠశాలలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. విద్యార్థులు కేవలం చదువుపైనే కాకుండా శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యం ఇవ్వా లన్నారు. మంచి అలవాట్లు, ఏకాగ్రత, క్రమశిక్షణ పెంపొందించుకోవాలని సూచించారు. మా దకద్రవ్యాల వినియోగంతో భవి ష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఇందులో డీఈవో మాధవి, డీఎస్పీ ఎల్‌.జీవన్‌ రెడ్డి, టూటౌన్‌ సీఐ నాగరాజు, ట్రైబల్‌ వెల్ఫేర్‌స్పోర్ట్స్‌ అధికారి పార్థసారథి, కౌన్సిలర్‌ మీరబాయి, టీయూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరాం, హెచ్‌ఎం కిషన్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement