విధుల్లో నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

విధుల్లో నిర్లక్ష్యం వద్దు

Nov 18 2026 12:02 AM | Updated on Nov 18 2026 12:02 AM

ఆదిలాబాద్‌టౌన్‌: వైద్యాధికారులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందంచాలని వైద్యారోగ్య శాఖ కమిషనర్‌ ముషరఫ్‌ అలీ ఫారూఖీ అన్నా రు. హైదరాబాద్‌ నుంచి మంగళవారం వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా, శిశు మరణాలు తగ్గించాలని, అన్ని కార్యక్రమాల్లో పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. నీతి అయోగ్‌కు సంబంధించి రాష్ట్రస్థాయిలో జిల్లా 3వ స్థానంలో ఉందని తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో డీఎంహెచ్‌వో సాధన, ప్రోగ్రాం అధికారులు వైసీ శ్రీనివాస్‌, వంశీ, వినోద్‌, ఈశ్వర్‌రాజ్‌, అశోక్‌, నిలోఫర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement