కడెం: విద్యార్థులకు చదువు భారం కాకుండా, ఆసక్తికరంగా మార్చేందుకు మండలంలోని ఎలగడప పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూచనపెల్లి శ్రీని వాస్ వినూత్న బోధనా పద్ధతికి శ్రీకారం చుట్టారు. ప్రాథమిక పాఠశాల దశలో విద్యార్థులకు తెలుగు అక్షరాల ఒత్తులను సులభంగా అర్థం చేయించేందు కు ‘ఒత్తుల జడ‘ అనే విభిన్న బోధనా సామగ్రిని రూపొందించారు. జడ ఆకారంలో కని పించేలా గుండ్రటి చక్రాలపై తెలుగు ఒత్తులను అ మర్చి, వాటిని వరుస క్రమంలో పేర్చి అభ్యాసాన్ని ప్రదర్శించారు. ఉపాధ్యాయుడి అంకితభావాన్ని పలు వురు అభినందిస్తున్నారు.


