సింగపూర్‌ పర్యటనకు ఉపాధ్యాయులు | - | Sakshi
Sakshi News home page

సింగపూర్‌ పర్యటనకు ఉపాధ్యాయులు

Aug 22 2026 1:59 AM | Updated on Aug 22 2026 1:59 AM

నిర్మల్‌ఖిల్లా/ఖానాపూర్‌/ఆసిఫాబాద్‌ రూరల్‌: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్టడీ ఎక్స్‌ప్లోజర్‌లో భాగంగా సింగపూర్‌ దేశంలో విద్యాపర్యటనకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి పలువురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. సెప్టెంబర్‌ 12నుంచి 19వరకు చేపట్టిన ఈ పర్యటనలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపికై న 29మంది హెడ్‌మాస్టర్లు, స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీలతో సహ 40మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని జెడ్పీహెచ్‌ఎస్‌ జన్కాపూర్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ వడ్లూరి రాకేశ్‌, రెబ్బెన ఎంపీపీఎస్‌ ఎస్జీటీ అడ్లూరి లావణ్య, నిర్మల్‌ జిల్లా వానల్‌పాడ్‌ ఎంపీపీఎస్‌ ఉపాధ్యాయుడు మాదరి ఎల్లన్న, ఖానాపూర్‌ మండలం మస్కాపూర్‌ పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ ప్రధానోపాధ్యాయుడు జాడి శ్రీనివాస్‌ ఎంపికయ్యారు. సింగపూర్‌లోని ఆధునిక విద్యావిధానాలు, వినూత్న బోధన పద్ధతులు, ఉత్తమ పాఠశాల విధానాలను అధ్యయనం చేయనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఈ నెల 22న ఎంపికై న ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి వర్చువల్‌ ఓరియంటేషన్‌ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వీసా, ప్రయాణ ఏర్పాట్లు, ఇతర మార్గదర్శకాలపై అధికారులు అవగాహన కల్పించనున్నారు. ఉపాధ్యాయుల ఎంపికపై ఉమ్మడి జిల్లాలోని విద్యాశాఖ అధికారులు అభినందనలు తెలిపారు.

అడ్లూరి లావణ్య

వడ్లూరి రాకేశ్‌

జాడి శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement