నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్‌

Aug 21 2026 3:03 AM | Updated on Aug 21 2026 3:03 AM

ఇచ్చోడ: నేర నియంత్రణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్‌ నిర్వహిస్తున్నామని ఉట్నూర్‌ ఏఎస్పీ రుత్విక్‌ సాయి కొట్టే అన్నారు. గురువారం తెల్లవారు జామున ఇచ్చోడ మండల కేంద్రంలోని ఇస్లాంపూర, రంజాన్‌పూర కాలనీలో తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలులేని 110 ద్విచక్ర వాహనాలు, ఆటో, 4 కార్లు, నంబర్‌ ప్లెట్‌లు లేని, ఫేక్‌ నంబర్లు ఉన్న 15 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్‌ ఇచ్చోడ స్టేషన్‌హౌజ్‌ ఆఫీసర్‌ నరేష్‌కుమార్‌, సీఐ సీహెచ్‌ రమేశ్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు డి.వెంకట్‌, మురళి, ఎన్‌.చంద్రశేఖర్‌, 150 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement