● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌రూరల్: విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదిలాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌ను శనివారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంజాయి రహిత జిల్లాకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వీపీవో విధానం ద్వారా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసుకుని సమాచారం సేకరించాలన్నారు. స్టేషన్‌కు వచ్చే బాధితులతో గౌరవపదంగా వ్యవహరించాలని సూచించారు. ముందుగా స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఇందులో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్‌రెడ్డి, రూరల్ సీఐ రహీంపాషా, ఎస్సై విష్ణువర్ధన్, గంగాప్రసాద్, సిబ్బంది ఉన్నారు.


