సంతనూతలపాడు: రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటుపరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని సంతనూతలపాడు రిజిస్ట్రార్ కార్యాలయ దస్తావేజు లేఖరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డాక్యుమెంట్ రైటర్ల అసోసియేషన్ పిలుపు మేరకు స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు వారి కార్యాలయాల షట్టర్లు మూసివేసి శుక్రవారం ఐదో రోజు పెన్‌డౌన్ కార్యక్రమం నిర్వహించారు. దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, ఇతర సహాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు.


