ఆదిలాబాద్‌టౌన్: జిల్లావ్యాప్తంగా గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణతో పాటు నేరాలు అరికట్టేందుకు రాత్రి సమయాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో జిల్లా పోలీసు అధికారులతో మంగళవారం నెలవా రీ నేర సమీక్ష నిర్వహించారు. కేసుల పురోగతిని సమీక్షించిన ఎస్పీ బాధితులకు త్వరితగతిన న్యా యం జరిగేలా దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా నిరంతరం గస్తీ నిర్వహిస్తూ పటిష్టమైన బీట్ వ్యవస్థ అమలు చేయాలన్నారు. గంజా యి రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు రాత్రి వేళల్లో బస్సులు తదితర వాహనాల్లో నార్కోటిక్ జాగిలాల సాయంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు డీడీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలన్నారు. స్టేషన్లలో 5ఎస్ విధానంతో పాటు వర్టికల్ విధానం పూర్తిస్థాయిలో అమలు చేయాలని, సీసీటీఎన్‌ఎస్ వ్యవస్థ ఎప్పటికప్పుడు నవీకరించి పెండింగ్ లేకుండా చూడాలని సూచించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యా ఖ్యలు, శాంతిభద్రతలకు భంగం కలిగించే పోస్టులపై ప్రత్యేక నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. విధుల్లో ప్రతిభ కనబ ర్చిన 40 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఇందులో అదనపు ఎస్పీ పి.మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్‌సాయి కొట్టే, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, ఇంద్రవర్ధన్, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్సైలు, డీసీఆర్‌బీ, ఐటీ కోర్, ఎన్‌ఐబీ, కమ్యూనికేషన్, ఫింగర్‌ప్రింట్ విభాగాల అధికారులు, రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


