బహుదూరపు బాటసారులు | - | Sakshi
Sakshi News home page

బహుదూరపు బాటసారులు

Jun 16 2026 11:46 PM | Updated on Jun 16 2026 11:46 PM

పొట్టకూటి కోసం పిల్లాపాపలతో వందల మైళ్లు ఎండనకా..వాననకా వలస జీవులు ప్రయాణం సాగిస్తున్నారు. రాజస్థాన్‌ నుంచి జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే కుటుంబాలు అధికంగా ఉన్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఉపాధి కోసం వలస వస్తుంటారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ పనిముట్ల తయారీ కోసం నిర్మల్‌, భైంసా, ఆదిలాబాద్‌ ప్రాంతాలకు రాజస్థాన్‌ నుంచి వలస కార్మికులు ఐదారు కుటుంబాలు చిన్నాపెద్ద తేడా లేకుండా ఒకే వాహనంపై నిర్మల్‌ జిల్లా కేంద్రం నేషనల్‌ హైవే–61 మీదుగా భైంసా వైపు వెళ్లారు. పిల్లాజెల్లతో.. మూటామల్లె సర్దుకుని వలస వెళ్తున్న కుటుంబాలను ‘సాక్షి’ కెమెరా క్లిక్‌ మనిపించింది.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, నిర్మల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement