ఆర్డీవోగా జగదీశ్వర్‌రావు బాధ్యతలు | - | Sakshi
Sakshi News home page

ఆర్డీవోగా జగదీశ్వర్‌రావు బాధ్యతలు

Apr 22 2026 7:24 AM | Updated on Apr 22 2026 7:24 AM

– 8లోu ● ● నార్నూర్‌ సీహెచ్‌సీలో మినరల్‌ ప్లాంట్‌ పనిచేయడం లేదు. బాలింతల వార్డులో చీకటి కమ్ముకుంది. ట్యూబ్‌లైట్లు పనిచేయడం లేదు. పడకలపై బెడ్‌షీట్లు లేవు. ఉన్నవి చినిగిపోయి దర్శనమిచ్చాయి. ● జైనథ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌తో పాటు సిబ్బంది అందుబాటులో ఉన్నారు. నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆవరణలో ఏర్పాటు చేసిన బోరు పని చేయడం లేదు. ● బేల పీహెచ్‌సీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్టు ఒక్కొక్కరు విధుల్లో ఉన్నారు. స్టాఫ్‌ నర్సులు ముగ్గురికి గాను ఒకరు హాజరయ్యారు. 12.30 గంటల తర్వాత ఆస్పత్రి నుంచి ఇద్దరు వైద్యులు వెళ్లిపోయారు. ఆస్పత్రిలో బెడ్స్‌పై దుప్పట్లు లేవు. మందులు అందుబాటులో ఉన్నాయి. ● నేరడిగొండ పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులకు గాను ఒకరు ఉన్నారు. మరొకరు రిమ్స్‌లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఫార్మసిస్టు, ఒక అటెండర్‌ సైతం డిప్యూటేషన్‌లో ఉన్నారు. దీంతో స్టాఫ్‌ నర్సులు రోగులకు సేవలు అందిస్తున్నారు. ● ఉట్నూర్‌ ఆస్పత్రిలో 155ఓపీ, 45 మంది ఇన్‌పేషెంట్లు ఉన్నారు. ఆర్‌ఓ ప్లాంట్‌ పనిచేయ డం లేదు. మురికి నీరు బయటకు వెళ్లకపోవడంతో ఆవరణలో అపరిశుభ్రత నెలకొంది. ● బజార్‌హత్నూర్‌ పీహెచ్‌సీలో నాలుగేళ్లుగా ఆర్‌వో ప్లాంట్‌ మూలన పడింది. నలుగురు వైద్యులు ఉండగా, అందరు పీజీ కోర్సుపై వెళ్లారు. సొనాల పీహెచ్‌సీ వైద్యుడు వారానికి ఒకసారి వచ్చి ఇక్కడ సేవలు అందిస్తున్నారు. నలుగురు స్టాఫ్‌ నర్సులకు ఇద్దరే ఉన్నారు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ● ఇంద్రవెల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసూతి గది లో, వరండాలో ఫ్యాన్లు పనిచేయడం లేదు. దీంతో బాలింతలు ఇబ్బందులు పడుతున్నా రు. ఇన్వర్టర్‌ బ్యాటరీలు పనిచేయడం లేదు. రాత్రి సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ● సాత్నాల మండలంలోని సైద్‌పూర్‌ పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు సేవలందించాల్సి ఉండగా.. ఒక పోస్టు ఖాళీగా ఉంది. మరొకరు కొద్ది రోజులుగా విధులకు హాజరు కావడం లేదని స్థానికులు చెబుతున్నారు. అలాగే సూపర్‌వైజ ర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్టులు సైతం విధులకు హాజరు కాలేదు. ఒక్క ఏఎన్‌ఎంలు రోగులకు వైద్య సేవలందిస్తూ కనిపించారు. ● బోథ్‌ సీహెచ్‌సీలో ఏడుగురు వైద్యులకు గాను ఇద్దరు మాత్రమే ఉన్నారు. రోగులు అధిక సంఖ్యలో హాజరవుతున్నా డాక్టర్లు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. నూతనంగా నిర్మించిన ఆస్పత్రి ఇంకా అందుబాటులోకి రాలేదు. పనులను మధ్యలోనే నిలిపివేశారు. అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ అందుబాటులో లేదు. ● గుడిహత్నూర్‌ పీహెచ్‌సీలో ఏడాది నుంచి ఒక వైద్యుడు మాత్రమే విధులు నిర్వహిస్తున్నాడు. సదరు వైద్యుడు సైతం పీజీకి వెళ్లడంతో ఇంద్రవెల్లికి చెందిన వైద్యుడికి అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో రోగులకు పూర్తి స్థాయిలో సేవలు అందని పరిస్థితి.

న్యూస్‌రీల్‌

పీహెచ్‌సీల్లో వైద్యుల కొరత సగం మందితోనే సేవలు జిల్లాలో 25 పోస్టులు ఖాళీ 18 మందికి పీజీ రావడంతో రిలీవ్‌ ఉన్నవారితోనే సర్దుబాటు రోగులకు తప్పని తిప్పలు

కై లాస్‌ నగర్‌: ఆదిలాబాద్‌ రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌(ఆర్డీవో)గా పి.జగదీశ్వర్‌రావు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇది వరకు ఆర్డీ వోగా పనిచేసిన స్రవంతి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అంతకు ముందు కలెక్టర్‌ రాజర్షిషాను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

ఇక్కడ ఖాళీగా కనిపిస్తున్నది తాంసి పీహెచ్‌సీ వైద్యాధికారి కుర్చీ. ఉదయం 11 గంటలకు ఈ సెంటర్‌ను ‘సాక్షి’ పరిశీలించగా వైద్యాధికారి అందుబాటులో లేరు. ఈ మెడికల్‌ ఆఫీసర్‌ ఉన్నత చదువు నిమిత్తం ఈనెల 1నుంచి లాంగ్‌లీవ్‌లో వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌, స్టాఫ్‌ నర్సు మాత్రం విధుల్లో ఉన్నారు. ఫార్మసిస్టు 11 గంటల తర్వాత విధులకు వచ్చారు. స్టాఫ్‌ నర్సు రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ ఒక్క పీహెచ్‌సీలోనే కాదు.. జిల్లాలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులే ఉన్నట్లుగా ‘సాక్షి’ విజిట్‌లో తేలింది.

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంగళవారం ‘సాక్షి’ విజిట్‌ చేసింది. పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం, సమయపాలన పాటించకపోవడం, మందుల కొరత తదితర సమస్యలు దర్శనమిచ్చాయి.

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వైద్యుల కొరత వేధిస్తోంది. దీంతో రోగులకు పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందని పరిస్థితి. జిల్లాలో 27 పీహెచ్‌సీలకు గాను 50 వైద్యపోస్టులు ఉన్నా యి. ఇందులో 25 మంది మాత్రమే పనిచేస్తుండగా, మిగతా పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉన్న వైద్యులతో సర్దుబాటు చేస్తూ రోగులకు సేవలు అందిస్తున్నారు. ఇందులో కొంత మంది సమయపాలన పాటించకపోవడం, మధ్యాహ్నమే ఇంటిముఖం పట్టడంతో రోగుల అవస్థలు వర్ణనాతీతం. ప్రస్తుతం భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికే 44 డిగ్రీల మార్క్‌ దాటాయి. జనం వడదెబ్బకు గురవుతున్నారు. వాంతులు, విరేచనాలు, జ్వరాల బారిన పడుతున్నారు. ఆస్పత్రికి వెళ్లిన సమయంలో వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో గత్యంతరం లేక ప్రైవేట్‌కు వెళ్లాల్సిన దుస్థితి.

ఖాళీలతో అవస్థలు..

జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు బోథ్‌, నార్నూర్‌ సీహెచ్‌సీలు ఉన్నాయి. పీహెచ్‌సీల్లో 50 పోస్టులకు గాను 25 మంది పనిచేస్తున్నారు. బజార్‌హత్నూర్‌లో నా లుగు పోస్టులకు గాను ఒక్కరు కూడా లేరు. భీంపూర్‌(టి)లో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుడిహత్నూర్‌, ఝరి పీహెచ్‌సీల్లో ఇదే పరిస్థితి. ఇద్దరు చొప్పున ఉండాల్సి ఉండగా, ఒక్కరు కూడా లేరు. సైద్‌పూర్‌, పీపీ యూనిట్‌, నేరడిగొండ, గాదిగూడ, పిట్టబొంగరంలో ఒక్కరు చొప్పున వైద్యులు ఉండాల్సి ఉండగాా, ప్రస్తుతం ఈ పీహెచ్‌సీల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బోథ్‌ సీహెచ్‌సీలో 6 పోస్టులకు గాను ఇద్దరు మాత్రమే పనిచేస్తుండగా, 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగతా పీహెచ్‌సీల్లో ఉన్న వైద్యులతో సేవలు అందిస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

కై లాస్‌నగర్‌: పెన్షనర్లకు అన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యసేవలు అందించా లని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ రిటైర్డ్‌ పర్సన్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు సాయిరి శశి కాంత్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు అదనపు కలెక్టర్‌ ఆర్‌ఎస్‌ చిత్రుకు మంగళవారం ఆయన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఇందులో సంఘం నాయకులు దయానందరెడ్డి, జగన్మోహన్‌, దేవిదాస్‌, గంగాధర్‌, శ్యామ్‌ రాజుగౌడ్‌, ఉమాకాంత్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement