నా ప్యాడ్‌పైన ఆ మహనీయుని కొటేషన్స్‌.. | - | Sakshi
Sakshi News home page

నా ప్యాడ్‌పైన ఆ మహనీయుని కొటేషన్స్‌..

Jan 12 2026 7:20 AM | Updated on Jan 12 2026 7:20 AM

నా ప్యాడ్‌పైన ఆ మహనీయుని కొటేషన్స్‌..

నా ప్యాడ్‌పైన ఆ మహనీయుని కొటేషన్స్‌..

మాది భోరజ్‌ మండలంలోని పిప్పర్‌వాడ. అమ్మానాన్న లక్ష్మి–రాజీవ్‌రెడ్డి. నేను 2017లో ఫైర్‌మెన్‌గా ఎంపికయ్యాను. 2018లో ఎకై ్సజ్‌ కానిస్టేబుల్‌, 2024లో గ్రూప్‌–4లో ఉద్యోగాలకు ఎంపికై నా చేరలేదు. గొప్పగా ఆలోచించాలి, గొప్పగా జీవించాలనే వివేకానందుని స్ఫూర్తితో ముందుకు సాగాను. ఈ క్రమంలోనే 2024లో గ్రూప్‌–1 అధికారిగా ఎంపికయ్యాను. ప్రస్తుతం జిల్లా ఖజనా శాఖలో అసిస్టెంట్‌ ట్రెజరరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నా. ‘నీ బలమే జీవనం.. నీ బలహీనతే నీ మరణమనే’ ఆ మహనీయుని సూక్తి మనలో అంతర్లీనంగా ఉన్న శక్తిని గుర్తించేందుకు తోడ్పడుతుంది. దాన్ని ఎవరైతే గుర్తించి బయటకు తీస్తారో తప్పకుండా విజయం సాధిస్తారు. సరైన మార్గాన్ని నిర్దేశించుకునేందుకు ఆయన బోధనలు ఎంతో తోడ్పడుతాయి. ఉద్యోగ సన్నద్ధ సమయంలో స్టడీ హాల్‌, ప్యాడ్‌పైన ఆ మహనీయుని కొటేషన్స్‌ రాసుకునేవాడిని. ఆ స్ఫూర్తితోనే ఎస్సై మెయిన్స్‌ వరకు వచ్చి చేజారినా, జూనియర్‌ లెక్చరర్‌ 1:2 నిష్పత్తిలో తక్కువ మార్కులతో వెనుకబడినా నిరాఽశ చెందలేదు. పాజిటివ్‌ ధృక్పథంతో ముందుకు సాగాను కనుకే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగాను.

– సర్సన్‌ శఽశిధర్‌ రెడ్డి, అసిస్టెంట్‌ ట్రెజరీ అధికారి, ఆదిలాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement