● ఈనెల 16న జిల్లాకు రేవంత్‌రెడ్డి ● కొరటా–చనాఖా పంప్‌హౌ
కొరటా–చనాఖా బ్యారేజ్
సాక్షి,ఆదిలాబాద్: సీఎం ఆదిలాబాద్ పర్యాటన ఖరారైంది. ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాకు విచ్చేయనున్నారు. కొరటా–చనాఖా బ్యారేజ్ నిర్మాణంలో భాగంగా మెజార్టీ పనులు ఇప్పటికే పూర్తయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పంప్‌హౌస్‌ల నుంచి నీటి విడుదల కార్యక్రమాన్ని సీఎం ఆ రోజున ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కూడా హాజరుకానున్నారు. ఈ మేరకు అధికారిక షెడ్యూల్ కూడా విడుదలైంది. ముఖ్యమంత్రి ఆ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి 12 గంటల వరకు భోరజ్ మండలం హత్తిఘాట్ వద్ద పంప్‌హౌస్ వద్దకు హెలిక్యాప్టర్ ద్వారా చేరుకోనున్నారు. అక్కడ శిలాఫలకం ఆవిష్కరించి మెయిన్ కెనాల్ వద్ద పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
బ్యారేజ్ తీరుతెన్నులు
లోయర్ పెన్‌గంగపై తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దున నదీ భూభాగాన్ని కలుపుతూ కొరటా–చనాఖా బ్యారేజ్ నిర్మాణానికి రూ.1,227 కోట్ల అంచనా వ్యయంతో 2015–16లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిపాలన ఆమోదం ఇచ్చింది. 2016–17లో కాంట్రాక్ట్ సంస్థలతో ఒప్పందం పూర్తి చేసుకొని ఆదిలాబాద్ నియోజకవర్గంలోని రెండు మండలాల్లో, బోథ్ నియోజకవర్గంలోని ఒక మండలంలో మొత్తంగా 51వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ పదేళ్ల కాలంలో సవరించిన అంచనా వ్యయం అంతకంతకూ పెరుగుతూ పోయింది. దీంట్లో బ్యారేజ్, పంప్‌హౌస్, ఎల్‌పీపీ మెయిన్ కెనాల్ పనులు పూర్తయ్యాయి. ఉపకాలువల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతోపాటు పిప్పల్‌కోటి రిజర్వాయర్ పనులు కూడా చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం పంప్‌హౌస్ వద్ద నీటి విడుదల మాత్రమే చేయనున్నారు.
మోటార్ల సామర్థ్యం ఇలా..
హత్తిఘాట్ వద్ద పంప్‌హౌస్ నిర్మించారు. ఆరు మోటార్లు బిగించారు. ఇందులో 5.5 మెగా వాట్లకు సంబంధించి మూడు, 12 మెగావాట్లకు సంబంధించి మరో మూడు మోటార్లను ఏర్పాటు చేశారు.
భూపరిహారం అందజేత..
ఈ ప్రాజెక్ట్‌లో మెయిన్ కెనాల్ పనులు పూర్తి కాగా, చేల వరకు నీళ్లు అందించేందుకు ఉప కాలువల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. మొత్తంగా వీటి కోసం 1700 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఇందుకోసం రూ.175 కోట్లు పరిహారం అందజేయాలి. ఇందులో ప్రస్తుతం రూ.70 కోట్లు భూపరిహారం కింద రైతులకు అందజేయనున్నారు.
బ్యారేజ్ స్వరూపం ఇలా..
తెలంగాణ వైపు కొరటా–మహారాష్ట్ర వైపు చనాఖా గ్రామాల మధ్య పెన్‌గంగ భూభాగంపై బ్యారేజ్, దానికి కొద్ది దూరంలో పంప్‌హౌస్, కాలువల నిర్మాణం జరిగాయి. డిస్ట్రిబ్యూటరీ, పిప్పల్‌కోటి రిజర్వాయర్ పనులు చేపడుతున్నారు.
ప్రాజెక్ట్ వివరాలు..
అంచనా వ్యయం : రూ.1,891 కోట్లు
పూర్తయిన పని విలువ : రూ.1,105 కోట్లు
బ్యారేజ్ నిర్మాణానికి సవరించిన
అంచనా విలువ : రూ.506 కోట్లు
పని పురోగతి : పూర్తి
లోయర్ పెన్‌గంగ ప్రాజెక్ట్ మెయిన్ కెనాల్..
నిర్మించిన ప్రాంతం: భోరజ్, జైనథ్,
బేల మండలాల్లో 42 కిలోమీటర్ల పరిధిలో
సవరించిన అంచనా విలువ : రూ.299 కోట్లు
పని పురోగతి : పూర్తి
పంప్‌హౌజ్..
నిర్మించిన ప్రాంతం: భోరజ్ మండలం హత్తిఘాట్
సవరించిన అంచనా విలువ : రూ.209 కోట్లు
డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్..
నిర్మించే ప్రాంతం : జైనథ్, భోరజ్, బేల మండలాలు
డిస్ట్రిబ్యూటరీ నంబర్లు : డి–14, డి–15, డి–16, డి–16ఏ, డి–17, డి–18, డి–19
పనుల పురోగతి : చేపట్టాల్సి ఉంది
● ఈనెల 16న జిల్లాకు రేవంత్‌రెడ్డి ● కొరటా–చనాఖా పంప్‌హౌ
● ఈనెల 16న జిల్లాకు రేవంత్‌రెడ్డి ● కొరటా–చనాఖా పంప్‌హౌ
● ఈనెల 16న జిల్లాకు రేవంత్‌రెడ్డి ● కొరటా–చనాఖా పంప్‌హౌ


