బాధితులకు అండగా ఉండాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్
కై లాస్‌నగర్: బాధితులకు న్యాయం చేకూర్చడమే పోలీస్‌శాఖ ప్రధాన బాధ్యత అని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 33 మంది తమ సమస్యలపై దరఖాస్తులు అందజేశారు. వాటిని స్వీకరించిన ఎస్పీ వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించి, కేసులు త్వరితగతిన పరిష్కరించి న్యాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.మౌనిక, సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి కవిత, సిబ్బంది వామన్ తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి
ఆదిలాబాద్‌టౌన్: వాహనదారులంతా తప్పని సరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. రోడ్డు భ ద్రత మాసోత్సవాల సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ వద్ద ప్రారంభమైన ర్యాలీ వినాయక్ చౌక్, దేవిచంద్ చౌక్, బస్టాండ్, కలెక్టర్ చౌ రస్తా మీదుగా సాగింది. ఈ సందర్భంగా ఎ స్పీ మాట్లాడుతూ, ఈ ఏడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాలను 20 శాతం తగ్గించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి. సురేందర్ రావు, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, సీఐలు బి.సునీల్ కుమార్, కర్ర స్వామి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు డి. వెంకటి, టి.మురళి, ఎన్.చంద్రశేఖర్, ట్రాఫిక్ ఎస్సైలు దేవేందర్, మహేందర్, టీజీఎస్పీ, ఏఆర్, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


