‘మున్సిపల్‌పై కాంగ్రెస్ జెండా ఎగరేయాలి’
కైలాస్‌నగర్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్ బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సోమవారం మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం అందరూ కష్టపడి పనిచేయాలన్నారు. అనంత రం సీఎం రేవంతన్న బస్తీబాట ప్రచార పోస్టర్ ఆవిష్కరించారు. మంగళవారం నుంచి పట్టణంలోని ఆయా వార్డుల్లో పాదయాత్ర చేయనున్నట్లుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపూరావ్, డీసీసీబీ మాజీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, నాయకులు దిగంబరావ్ పాటిల్, సుఖేందర్ తదితరులు పాల్గొన్నారు.


