‘ప్రణామ్’ సద్వినియోగం చేసుకోవాలి
కై లాస్‌నగర్: సమాజ నిర్మాణంలో వయోవృద్ధుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ సాధికారత శాఖ ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ క్వార్టర్స్‌లైన్‌లో ఏర్పాటు చేసిన ప్రణామ్ డే కేర్ సెంటర్‌ను కలెక్టర్ రాజర్షి షాతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వృద్ధుల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం డే కేర్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రణామ్ సేవలను వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముందుగా వర్చువల్ విధానంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ సెంటర్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దేవిదాస్ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.


