1,43,655 | - | Sakshi
Sakshi News home page

1,43,655

Jan 13 2026 5:57 AM | Updated on Jan 13 2026 5:57 AM

1,43,655

1,43,655

‘మున్సిపల్‌’ తుది జాబితా విడుదల పురుషులతో పోల్చితే మహిళా ఓటర్లే అధికం నేడు పోలింగ్‌ కేంద్రాల ప్రకటన

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ బల్దియా ఓటర్ల తుది జాబితాను మున్సిపల్‌ అధికారులు సోమవారం విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా వార్డుల వారీగా సిద్ధం చేసిన ఫొటోలతో కూడిన ఓటరు తుది జాబితాను సాయంత్రం 6 గంటల సమయంలో ప్రకటించారు. పట్టణంలోని 49 వార్డుల పరిధిలో 1,43,655 మంది ఓటర్లున్నట్లుగా లెక్క తేల్చారు. ఇందులో పురుష ఓటర్లు 69,813 మంది ఉండగా, మహిళలు 73,836 మంది ఉన్నారు. ఇతరులు మరో ఆరుగురున్నారు. పురుషులతో పోల్చితే మహిళా ఓటర్లు 4,023 మంది అధికంగా ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటముల్లో వీరే కీల కం కానున్నారు. ఈ జాబితాలను మున్సిపల్‌ కా ర్యాలయంతో పాటు కలెక్టరేట్‌, ఎన్నికల అఽ దికారి, ఆర్డీవో, అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయా ల నోటీసు బోర్డులలో ప్రదర్శించనున్నారు. ఇక పోలింగ్‌ కేంద్రాల తుది జాబితాను మంగళవారం విడుదల చేయనున్నారు. ఓటరు జాబితా విడుదల కావడంతో వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్ర క్రియ షురూ కానుంది. దీనిపై రేపో, మాపో ఈసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే అవకాశమున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియపూర్తయిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్‌విడుదల కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అభ్యంతరాలను సవరించి...

ఈ నెల 1న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశారు. చాలా వరకు తప్పులు దొర్లాయి. పలు వార్డుల్లోని ఓటర్లు ఇతర వార్డుల్లోకి తారుమారయ్యారు. గందరగోళ పరిస్థితి తలెత్తెంది. మున్సిపల్‌ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రం ఏ ర్పాటు చేసి అభ్యంతరాలు స్వీకరించారు. మొ త్తం 308 అభ్యంతరాలు అందాయి. వాటన్నింటిపై వార్డు అధికారులు, బిల్‌ కలెక్టర్లతో క్షేత్రస్థాయిలో ప్రత్యేక విచారణ చేయించి ఒక వార్డులోనిఓటర్లు అదే వార్డులో ఉండేలా శ్రద్ధ

వహించారు.

ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో

వార్డుల వారీగా ఓటర్ల వివరాలు

వార్డునంబర్‌ ఓటర్లు వార్డునంబర్‌ ఓటర్లు

1 2,875 25 2,678

2 3,194 26 3,122

3 2,756 27 2,558

4 3,832 28 2,849

5 2,830 29 2,943

6 2,933 30 3,254

7 3,099 31 2,958

8 3,230 32 3,524

9 2,620 33 2,399

10 3,094 34 2,684

11 2,831 35 3,270

12 3,197 36 3,073

13 2,863 37 2,374

14 2,977 38 3,305

15 3,180 39 3,077

16 3,500 40 2,993

17 2,675 41 2,845

18 2,638 42 2,703

19 3,053 43 2,890

20 2,801 44 3,473

21 3,163 45 2,511

22 3,208 46 2,571

23 2,867 47 2,487

24 2,767 48 2,358

49 2573

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement