పోలవరం
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 13 శ్రీ జనవరి శ్రీ 2026
● మన్యంలో కాలు దువ్వుతున్న కోడి
● జిల్లాలో పందేలకు చకచకా ఏర్పాట్లు
● పేకాట, గుండాటల నిర్వహణకూ సిద్ధం
● పోలీసు హెచ్చరికలు పట్టని వైనం
గిరి.. పందెం బరి
రంపచోడవరం: మన్యంలో కోడి పందేలు.. గుండాటలను అడ్డుకోవాలని పోలీసు శాఖ ఆంక్షలు విధిస్తోంది. జూదాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరిస్తుంది. అయినా జూదరులు వెనక్కి తగ్గడం లేదు. పందేల కోసం కాలు దువ్వుతున్నారు. పలువురు నేతల వత్తాసుతో జిల్లాలో ఈ ఏడాది పెద్ద ఎత్తున పందేల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి మండలంలోనూ చిన్నా పెద్దా పందేలు జరుగనున్నాయి. వీటితో పాటు పందేల బరుల వద్ద కిళ్లీ, అనధికార మద్యం షాపులు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. కొంత మంది నిర్వాహకులకు ఇప్పటికే సృష్టమైన సంకేతాలు రావడంతో పందెం బరులు సిద్ధం చేసే పనిలో పడ్డారు. కొన్నిచోట్ల కోడి పందేలతో పాటు పేకాట, గుండాట నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భోగి పండగ రోజున కోడి పందేలు మొదలు పెట్టి, వరుసగా మూడు రోజుల పాటు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సీతపల్లి రోడ్డులో భారీగా..
జిల్లా కేంద్రం రంపచోడవరానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని సీతపల్లి ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి సమీపంలో ప్రధాన రహదారి పక్కన, లోపల ఉన్న ఖాళీ స్థలంలో కోడి పందేల నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాది పందిరిమామిడి జంక్షన్ నుంచి వెళ్లే రహదారిలో భారీ బరి నిర్వహించారు. ఈ ఏడాది కోడి పందేలు నిర్వహించే స్థలాన్ని మార్పు చేశారు. ఎందుకంటే, నిర్వాహకులు మారడంతో ఇలా చేశారని స్థానికులు చెబుతున్నారు. మూడు రోజుల పాటు గుండాటలు నిర్వహించేందుకు రూ. 4 లక్షల వరకూ నిర్వాహకులకు ఇచ్చేందుకు బేరసారాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే పేకాట ఆడించేందుకు రూ. 2 లక్షల వరకూ నిర్వాహకులకు ముట్టజెప్పేందుకు మాటలు జరిగినట్లు తెలిసింది. అలాగే ఇక్కడ జరిగే కోడి పందేలకు దగ్గరలో ఎవరూ పందేలు నిర్వహించకుండా చూసుకుంటున్నారని చోటామోటా నిర్వాహకులు బహిరంగంగానే చెబుతున్నారు. ఏటా రంపచోడవరం మండలం గోగుమిల్లి, సోకులగూడెం, బోలగొండ ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా పందేల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ భారీగా సొమ్ము చేతులు మారనుంది. మరి పోలీసులు ఏం చేస్తారో వేచి ఉండాల్సిందే..
పోతుకొండ.. ఎప్పుడూ ఆగకుండా..
దేవీపట్నం మండలం పోతుకొండలో ప్రతి ఏడాదీ కోడి పందేలు జరుగుతుంటాయి. ఇప్పటికే గుండాట, పేకాటల నిర్వహణకు మైదాన ప్రాంతానికి చెందిన వారు రూ. 6.50 లక్షలు చెల్లించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అడ్డతీగల మండలం తుంగమడుగుల, మట్లపాడు, వీరభద్రపురం, డొక్కపాలెం, తిమ్మాపురంలో కూడా కోడి కాలు దువ్వుతోంది. వీఆర్‌పురం మండలం వీఆర్‌పురంలోనే కోడి పందేలు, పేకాట, గుండాటలు జరిపేందుకు గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల పాటు ఇక్కడ కోడి పందేలు జరుగుతాయని స్థానికులు చెబుతున్నారు. ఎటపాక మండలం నల్లకుంట, గుండాల, చోడవరంలో కూడా భారీగా జూదాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల స్థలాలను చదును కూడా చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజలు కూడా ఇక్కడకు వచ్చి కోడి పందేలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. పందేలను అడ్డుకుంటామని పోలీసు శాఖ చెబుతుంటే, ఎలాగైనా పందేలు నిర్వహిస్తామని నిర్వాహకులు ముందుకు సాగుతున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష
దారి చూపండి సారూ..
పీజీఆర్‌ఎస్‌లో గిరిజనుల అర్జీలు
గిరి.. పందెం బరికి సిద్ధమైంది. మన్యసీమలో కోడి కాలు దువ్వుతోంది.. సంక్రాంతి పండగల నేపథ్యంలో పందెం బరుల ఏర్పాటు ఇప్పటికే జరగ్గా, మరికొన్ని చోట్ల చకచకా సాగుతోంది.. పండగ మూడు రోజులూ రూ.కోట్లలో జూదం జరగనుంది.. పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా, ఎలాగైనా పందెం కోడిని బరిలో దించేందుకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేస్తున్నారు.
పందేల నిర్వహణకు అనుమతులు లేవు
సంక్రాంతి పండగ సందర్భంగా జిల్లాలో కోడి పందేలను నిషేధించాం. ఇది పక్కాగా అమలు చేసేందుకు రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ, అటవీ శాఖలు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. కోడి పందేలు జరిగే అవకాశామున్న గ్రామాలు, ఖాళీ ప్రదేశాలు, ప్రైవేట్ భూములను ముందుగానే గుర్తించి పెట్రోలింగ్ తనిఖీలు నిర్వహిస్తున్నాం. కోడి పందేలకు ఏ విధమైన రాత పూర్వక, మౌఖిక అనుమతులు ఇవ్వరాదని, ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఉపయోగించరాదని రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులకు సృష్ణమైన ఆదేశాలు ఇచ్చాం.
– శుభమ్ నొఖ్వాల్,
సబ్ కలెక్టర్, రంపచోడవరం
పోలవరం
పోలవరం
పోలవరం
పోలవరం


