మాతా శిశు మరణాల నివారణే లక్ష్యం
ఆదిలాబాద్‌టౌన్: మాతా శిశు మరణాలు పూర్తి గా అరికట్టడమే లక్ష్యమని కలెక్టర్ రాజర్షిషా అ న్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో వై ద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, వివిధ విభాగా ల అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్య సేవలు మరింత మెరుగుపడాలని సూచించారు. 2027 నాటికి మాతా శిశు మరణాల రేటును సింగిల్ డిజిట్‌కు తగ్గించాలన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మరణాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రసవం జరిగిన తర్వాత బాలింతలపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలన్నారు. కార్డియాలజీ, రేడియాలజీ, గైనకాలజీ విభాగాలు పరస్పర సహకారంతో పనిచేయాలని సూచించారు. ఏ ఎన్‌సీ కేసులు, హాజరు, ఇతర సమస్యల పరి ష్కారానికి హెచ్‌వోడీలు, డ్యూటీ డాక్టర్లు, పీజీ లు, సీనియర్ రెసిడెంట్లు సమన్వయంతో పని చేయాలన్నారు. సమావేశంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథో డ్, అదనపు డీఎంహెచ్‌వో సాధన, వైద్యాధికా రులు అనంత్‌రావు, దీపక్, కళ్యాణ్‌రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


