మంత్రి ఉత్తమ్‌ను కలిసిన నరేశ్‌జాదవ్
కై లాస్‌నగర్: జిల్లాలోని కుప్టి, కొరటా– చనాఖా ప్రా జెక్టుల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్షుడు నరేశ్ జా దవ్ కోరారు. శనివారం ఆయన రాష్ట్ర నీటిపారుద ల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో కలిసి శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని పలు చెరువులు, సాగునీటి ప్రాజెక్టులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కుప్టి ప్రాజెక్టు నిర్మాణంతో పాటు కొరటా–చనాఖా ప్రాజెక్టును పూర్తిచేసేలా నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. వీటి పై మంత్రి సానుకూలంగా స్పందించినట్లుగా తెలి పారు. ప్రాజెక్టుల మంజూరుతో పాటు నిర్మాణ ప నులు త్వరగా పూర్తి చేసేలాచర్యలు తీసుకుంటా మ ని హామీ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవరెడ్డి ఉన్నారు.


