కేంద్ర నిధులతోనే అభివృద్ధి
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాను కేంద్ర ప్రభుత్వ ని ధులతో అభివృద్ధి చేసేలా అన్ని బాధ్యతలు తీసుకుంటామని ఎంపీ గొడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని న్యూహౌసింగ్ బోర్డు కాలనీ లో గల పార్టీ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్‌తో కలి సి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారాన్ని కార్యకర్తలు అన్ని వార్డుల్లో ప్రజలకు తెలియజేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించినా, సహకరించిక పోయినా జిల్లా అభివృద్ధికి తమవంతు బాధ్యతగా నిధులు తీసుకొస్తామన్నారు. గడిచిన పదేళ్లలో బీఆర్‌ఎస్ చేపట్టని రైల్వే బ్రిడ్జి పనులను తాము వంద శాతం చేపడతామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆదిలాబాద్ కు ఎయిర్‌పోర్టు, ఆర్‌వోబీ, ఆర్‌యూబీ పనుల ను మంజూరు చేశామని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు నగేశ్, విజయ్, ప్రవీణ్, రాజు, క్రాంతి, లాలామున్నా, రఘుపతి, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.


