పండుగ ఆనందంగా జరుపుకోవాలి
ఆదిలాబాద్‌టౌన్: సంక్రాంతి పండుగను ఆనందంగా అందరూ జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం సంక్రాంతి సంబరాలు నిర్వహించా రు. పిల్లలకు గాలిపటాలు, మహిళలకు ము గ్గు ల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పతంగీ ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చైనామాంజా, అసాంఘిక కార్యకలాపాలకు ప్ర జలు దూరంగా ఉండాలని సూచించారు. ము గ్గుల పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. ఇందులో అదనపు ఎస్పీలు కాజల్ సింగ్, సురేందర్‌రావు, డీఎస్పీలు పోతారం శ్రీని వాస్, జీవన్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


