బోనాల స్పెషల్.. పూసాయి
● పుష్య మాసం.. జాతరలకు ప్రత్యేకం ● జిల్లాలో వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మికత
భోరజ్ మండలం పూసాయి గ్రామంలో ఎల్లమ్మతల్లి ఆలయం ఉంది. ఏటా పుష్యమాసంలో నెల పాటు జాతర కొనసాగుతుంది. ఇక్కడ అమ్మవారిని కొలిస్తే చర్మ వ్యాధులు దూరమవుతాయని భక్తుల నమ్మకం. ఈమేరకు కుటుంబాలతో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. డిసెంబర్ 20న ప్రారంభమైన జాతర జనవరి 20 వరకు కొనసాగనుంది. ప్రతీ ఆదివారం, శుక్రవారం రద్దీ ఉంటుంది. జిల్లా కేంద్రం నుంచి 14కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఆదిలాబాద్ నుంచి ఇక్కడికి ఆర్టీసీ బస్సు సదుపాయం కలదు.


