ప్రమాదాల నియంత్రణకు చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: ప్రమాదాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ అఖిల్ మ హా జన్ తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్ హెడ్ క్వా ర్టర్స్ సమావేశ మందిరంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. జిల్లాలో ఈ ఏడాది 20శాతం వరకు రోడ్డు ప్ర మాదాలను తగ్గించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి నేపథ్యంలో చైనా మా ంజాను కట్టడి చేస్తామని పేర్కొన్నారు. లక్కీ డ్రాలు నిర్వహించకుండా చర్యలు చేపడతామని చెప్పారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా లైసెన్స్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. గత నెలలో జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 50మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. అదనపు ఎస్పీలు కాజల్‌సింగ్, బీ సురేందర్‌రావు, ఏఎస్పీ అడ్మిన్ మౌనిక, శిక్షణ ఐపీఎస్ రాహుల్‌కాంత్, డీఎ స్పీలు శ్రీనివాస్, జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.


