రికార్డులు సక్రమంగా నిర్వహించాలి
ఆదిలాబాద్‌రూరల్: ఈజీఎస్ పనుల రికార్డులు సక్రమంగా నిర్వహించాలని అడిషనల్ డీఆర్డీవో కుటుంబరావు సూచించారు. శుక్రవారం ఆదిలాబాద్ రూర ల్ మండల పరిషత్ సమావేశ మందిరంలో 2024–25లో జరిగిన పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. రూ.7.60కోట్లతో పనులు ప్రారంభించి రూ.7.50 కోట్లు కూలీలకు చెల్లించగా.. రూ.10 లక్షలు మెటీరియల్ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. అలాగే, రూ.4.17 కోట్లతో పీఆర్ కింద సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇతర పనులు చేపట్టినట్లు తెలిపారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో రూ.23 లక్షలతో నర్సరీల్లో మొ క్కల పెంపకం చేపట్టినట్లు పేర్కొన్నారు. కాగా, పొ రపాట్లు చేసిన ఉద్యోగులకు చిన్నపాటి జరిమానాలు విధించారు. కార్యక్రమంలో ఏపీడీ కృష్ణారా వు, గజానంద్, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి రాజేశ్వర్, అంబుల్డ్ మ్యాన్ వీణ, ఎంపీడీవో వంశీకృష్ణ, ఎస్‌ఆర్‌పీలు కొమురయ్య, మహేశ్, ఏపీవో జాకిర్ హుస్సేన్, టీఏ తదితరులున్నారు.


