‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
ఆదిలాబాద్‌టౌన్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా విద్యాధికారి రాజేశ్వర్ సూచించారు. శుక్రవారం డీఈవో చాంబర్‌లో వరంగల్ ఆర్‌జేడీ సత్యనారాయణరెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. పీఎంశ్రీ ని ధుల్లో అక్రమాలు జరగకుండా పాఠశాల అభివృద్ధికి వినియోగించాలని, బిల్లులను డీటీవో లో అందించాలని తెలిపారు. కేజీబీవీల్లో మె నూ ప్రకారం విద్యార్థినులకు భోజనం పెట్టాల ని, మెస్‌చార్జీ లను పరిశీలించాలని ఆదేశించా రు. ఉల్లాస్ కార్యక్రమాన్ని గ్రామాల్లో ప్రాథమి క పాఠశాలల హెచ్‌ఎంలు పరిశీలించాలని, 15 రోజులకోసారి సమీక్ష నిర్వహించాలని సూచించారు. రాజేశ్వర్‌రావు వెంట ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ అశోక్, సెక్టోరల్ అధికారులు రఘురమణ, తిరుపతి, మండల విద్యాధికారి సోమ య్య, ఏడీ వేణుగోపాల్‌గౌడ్, పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులున్నారు.


