అక్షరాస్యులుగా మారాలి
కైలాస్‌నగర్: స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులంతా అక్షరాస్యులుగా మారాలని మె ప్మా డీఎంసీ శ్రీనివాస్ సూచించారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణ పే దరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక సంఘ భవనంలో రిసోర్స్ పర్సన్లు, ఎస్‌ఎల్‌ఎఫ్ ఓబీలు, సీసీ లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో చదువుకున్న వారికి మార్చిలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఉత్తీర్ణులైనవారికి ఓపెన్ స్కూల్ ద్వారా పది, ఇంటర్, డిగ్రీ పరీక్షలు రా సే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. కార్య క్రమంలో వయోజన విద్యాశాఖ డీడీ శ్రీనివాసరెడ్డి, మెప్మా టీఎంసీ భాగ్యలక్ష్మి, సీవోలు గంగన్న, సందీప్‌రెడ్డి, పండరి, రాష్ట్ర సీఆర్పీలు ప్రమీల, సునీత, టీఎల్‌ఎఫ్ ఉపాధ్యక్షురాలు వందన తదితరులు పాల్గొన్నారు.


