విద్యతోనే అభివృద్ధి సాధ్యం
ఇంద్రవెల్లి: విద్యతోనే అభివృద్ధి సాధ్యమని,ఈ మేర కు ఆదివాసీలు తమ పిల్లల చదువుపై దృష్టి సారించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ‘పోలీసు మీ కోసం’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని పాట గూడ(కే) గ్రామంలో గురువారం నిర్వహించి న దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఎనిమిది గ్రామాలకు చెందిన సుమారు 500 మంది ఆదివాసీలకు దుప్పట్లు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూ రంగా ఉండాలని సూచించారు. బాల్య వివాహాలు అరికట్టాలన్నారు. ఫకీర్లు, మంత్రగాళ్లను నమ్మవద్దని, అనారోగ్యం బారిన పడితే వైద్యులను సంప్రదించాలన్నారు. ఇందులో ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్‌సింగ్, సీఐ ప్రసాద్, ఎస్సై సాయన్న, సర్పంచ్‌లు రాజేశ్వర్, జమున నాయక్, శ్రీరాం, విఠల్, విజయమాల, పటేళ్లు తదితరులున్నారు.


