లంబాడాలను ‘ఎస్టీ’ నుంచి తొలగించాలి
కై లాస్‌నగర్: చట్ట బద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని మాజీ ఎంపీ, రాజ్‌గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం ఆయన కేంద్ర గిరిజన శాఖ మంత్రి జ్యుయల్ ఒరం, సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికేలను ఢిల్లీలో కలిసి వినతిపత్రాలు అందజేశారు. తెలంగాణలో ఏళ్లుగా ఎస్టీలుగా చలామణి అవుతున్న లంబాడాలు ఎస్టీలు కాదని, తాము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే పలుమార్లు రుజువులతో సహా నివేదికలు అందించామన్నారు. సుప్రీంకోర్టులో కేసు త్వరితగతిన పరిష్కారమైతేనే నిజమైన ఆదివాసీలకు న్యాయం జరుగుతుందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీలను ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇది సరికాదన్నారు. మంత్రులను కలిసిన వారిలో ఆదివాసీ తొమ్మిది తెగల ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షుడు చుంచు రామకృష్ణ, ఆధార్ సొసైటీ ట్రెజరర్ పాపయ్య, న్యాయవాదులు పాపారావు, వాసం ఆనంద్ ఉన్నారు.


