ఆరోగ్య పాఠశాలతో బంగారు బాట
కై లాస్‌నగర్: విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బా టలు వేసేందుకు ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నా రు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆరోగ్య పాఠశాల, రోడ్డు భద్రత కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించా రు. తెలంగాణ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షల పోస్టర్, ఫ్లెక్సీ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఆరోగ్యం, పరిశుభ్రత, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించడమే ఆరోగ్య పా ఠశాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. వ్యక్తిగత ప రిశుభ్రత, పోషకాహారం, మానసిక ఆరోగ్యం, మా దకద్రవ్యాలు, వ్యాధుల నివారణ, వ్యక్తిత్వ వికాసం లాంటి అంశాలపై వారపు కార్యాచరణ రూపొందించి రోజుకో అంశంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలి పారు. విద్యార్థి దశ నుంచే రోడ్డు భద్రతపై అవగా హన కలిగి ఉండాలని, ఆదిలాబాద్‌ను ప్రమాద ర హిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పలువురు విద్యార్థులు ఆరోగ్య పాఠశాల, రోడ్డు భద్రత అంశాలపై ఉపన్యాసాలు, నాటికలతో ఆకట్టుకున్నారు. అనంతరం స్టూడెంట్ ఛాంపియన్ల కు కలెక్టర్ ప్రశంసాపత్రాలు, టీషర్టులు అందజేశా రు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్ర, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ఆరోగ్య పాఠశాల కోఆర్డినేటర్లు అజయ్, తిరుపతి, హెచ్‌ఎంలు, రవాణా, విద్యాశాఖల అధికారులు పాల్గొన్నారు.
పారదర్శకత పాటించాలి
ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ము న్సిపల్ ఎన్నికలు, ఓటరు జాబితాల సవరణ, అ భ్యంతరాల పరిష్కారంపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని, డూప్లికేట్ ఓట్లు, మృతిచెందిన వారి పేర్లు తొలగించాలని సూ చించారు. ఓటరు జాబితాలపై వచ్చే అభ్యంతరా లను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోపు పరి ష్కరించాలని తెలిపారు. సమావేశంలో లేవనెత్తిన పలు సందేహాలకు కలెక్టర్ సమాధానాలిచ్చారు. వా ర్డుల వారీగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటరు జాబితాల ప్రదర్శన తదితర అంశాలపై మున్సిపల్ అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్ర, మున్సిపల్ కమిషనర్ రాజు తదితరులు పాల్గొన్నారు.


