బీఆర్‌ఎస్ బంద్ ప్రశాంతం
ఆదిలాబాద్‌టౌన్: రంగు మారిన సోయా పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. జిల్లా కేంద్రంలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని దుకాణాలు మూసివేశారు. ఉదయం 4గంటల ప్రాంతంలో మాజీ మంత్రి, బీ ఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, నాయకులు ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి నిరసన తెలిపా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినా దాలు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందో ళనకారులను సముదాయించే ప్రయత్నంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. జోగు రామన్నను పోలీసులు అరెస్ట్ చేసి మావల పోలీస్‌స్టేషన్‌కు, మున్సిపల్ మాజీ చైర్మన్ జోగు ప్రే మేందర్‌ను టూటౌన్‌కు, మిగతావారిని ఆయా పోలీ స్‌స్టేషన్లకు తరలించారు. ఆ తర్వాత సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. ఉదయం 7గంటల ప్రాంతంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జోగు రా మన్న మాట్లాడుతూ.. రంగు మారిన సోయాబీన్ కొనుగోలు చేయాలని, కపాస్ కిసాన్, ఎరువుల బు కింగ్ యాప్‌లను తొలగించాలని డిమాండ్ చేశారు. నాయకులు జోగు మహేందర్, మెట్టు ప్రహ్లాద్, అజ య్, విజ్జగిరి నారాయణ, సాజిద్, ధమ్మపాల్, కొండ గణేశ్, తిరుపతి, ఉమాకాంత్, సుధీర్, గంగుల కిరణ్, సృజన్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.


