గడువులోపు ఏర్పాట్లు చేయాలి
ఇంద్రవెల్లి: ఈ నెల 18నుంచి నిర్వహించనున్న నా గోబా జాతర ఏర్పాట్లు గడువులోపు పూర్తి చేయాల ని డీఆర్డీవో రవీందర్ రాథోడ్ సూచించారు. మంగళవారం మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్నారు. కేస్లాపూర్ అనుబంధ గ్రామాల రోడ్లకు మరమ్మతు చేయడంతోపాటు తాగునీరు, మరుగుదొడ్లు, స్నానపు గదుల వసతులు కల్పించా లని, స్వచ్ఛ పనులు పూర్తి చేయాలని సూచించారు. నీటితో గోవాడ్ ప్రాంతం చిత్తడి కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. మహాపూజకు వచ్చే మెస్రం వంశీయులతోపాటు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి లోటు లేకుండా పూర్తిస్థాయి ఏర్పా ట్లు చేయాలని సూచించారు. ఆయన వెంట ఏపీవో జాదవ్ శ్రీనివాస్ తదితరులున్నారు.
పాఠశాలల సందర్శన
మండలంలోని కేస్లాపూర్ బాలికల ఆశ్రమ పాఠశా ల, ఇంద్రవెల్లి కేజీబీవీని డీఆర్డీవో, ఇంద్రవెల్లి ప్రత్యేకాధికారి రవీందర్ రాథోడ్ తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల పనితీరు తెలుసుకున్నారు. వెనుకబడిన వి ద్యార్థినులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. పదో తరగతి వార్షిక పరీక్షలో వందశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేయాల ని ఆదేశించారు. కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీవో జాదవ్ శ్రీనివాస్, ఉపాధ్యాయులున్నారు.


