ప్రైవేట్ ట్రావెల్స్‌లో గూడ్స్ తరలించొద్దు
ఆదిలాబాద్‌టౌన్: ప్రైవేట్ ట్రావెల్స్‌లో సరుకులు రవాణా చేయవద్దని ఆదిలాబాద్ డీఎస్పీ జీ వన్‌రెడ్డి సూచించారు. మంగళవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులతో సమావేశమై మాట్లాడారు. బస్సులో సీసీ టీవీ కెమెరాలు అమర్చాలని, డ్రైవర్లు రోడ్డు భ ద్రత నియమాలు పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. డ్రంకెన్‌డ్రైవ్ టెస్టు నిర్వహించాకే యజమానులు డ్రైవర్లకు వాహనాలు అప్పగించాలని తెలిపారు. గంజాయి, నిషేధిత పదార్థాలు రవాణా చేయకుండా జాగ్రత్త పడాలని, అనుమానాస్పద వ్య క్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. సీఐలు సునీల్‌కుమార్, నాగరాజు, కర్ర స్వామి, ఫణిందర్, మురళి తదితరులున్నారు.
పత్రాలుంటేనే గదులు అద్దెకివ్వాలి
సరైన ధ్రువీకరణ పత్రాలుంటేనే లాడ్జీల్లో గదులు అద్దెకివ్వాలని డీఎస్పీ జీవన్‌రెడ్డి సూచించా రు. వన్‌టౌన్‌లో లాడ్జి యజమానులతో సమావేశమై మాట్లాడారు. లాడ్జిల్లో పోలీసుల అనుమతి లేకుండా మల్టీ లెవల్ మార్కెటింగ్ సమావేశాలకు అనుమతివ్వొద్దని సూచించారు. ప్రతీ ఫ్లోర్, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. మార్కెటింగ్ చేసే వారికి గదులు అద్దెకు ఇవ్వవద్దని, వారి ద్వారా మోసం జరిగితే బాధ్యత వహించాల్సి ఉంటుందని, వ్యభిచారం, గేమింగ్, మ ట్కా, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే చర్యలు యజమానులపై తప్పవని హెచ్చరించారు.


