మాతృ మరణాలను నివారించాలి
ఉట్నూర్‌రూరల్: మాతృ మరణాలు సంభవించకుండా ఏఎన్‌ఎంలు బాధ్యతతో వ్యవహరించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ సూచించారు. మాతృ మరణాలను నివారించడంలో ఏఎన్‌ఎంల పాత్ర కీలకమని తెలిపారు. అర్మాన్ సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏఎన్‌ఎంలకు ఒక్కరోజు శి క్షణ ఇచ్చారు. గర్భిణులకు నెలవారీ వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలని సూచించారు. కౌన్సిలింగ్ విధానంపై ఏఎన్‌ఎంలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. గర్భిణుల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఐటీడీఏ సహకారం ఉంటుందని తెలిపారు. పీవో ఎంసీహెచ్ డాక్టర్ సాధన, అడిషనల్ డీఎంహెచ్‌వో మనోహర్, డీపీవో దేవిదాస్, ఇంక్వాస్ మేనేజ ర్ అమర్, హెచ్‌ఈ నాందేవ్, అర్మన్ సంస్థ ప్రతినిధులు డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ చరణ్, డాక్టర్ విజయసాగర్ తదితరులు పాల్గొన్నారు.


