ప్రారంభమైన పెన్ గంగజాతర
నది ఒడ్డున భక్తులు
సాత్నాల: భోరజ్ మండలం డోలార గ్రామ సమీపంలో తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు పెన్‌గంగ నది ఒడ్డున గంగజాతర సోమవారం ప్రారంభమైంది. మహారాష్ట్ర యావత్‌మాల్ జిల్లా పఠాన్‌బోరి గ్రామం నుంచి ఆధ్యాత్మిక గురువులు రామానంద్, మాధవరావు మహారాజ్‌ల పాదుకలను రథంలో పెట్టి డప్పుచప్పుళ్ల మధ్య తీసుకువచ్చారు. తెలంగాణ నుంచే కాక మహారాష్ట్ర నుంచి వేలాది భక్తులు తరలివచ్చారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. కుటుంబసభ్యులతో కలిసి పిండి వంటలు చేసి గంగమ్మ తల్లీకి నైవేద్యం సమర్పించారు. మొక్కులు చెల్లించుకున్నారు. నదిలో దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. ఈ జాతర శుక్రవారం వరకు కొనసాగనుంది. భక్తుల కోసం పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


