నిబంధనల ప్రకారమే ఓటరు జాబితా
కై లాస్‌నగర్: రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధన ల ప్రకారమే పారదర్శక ఓటరు జాబితా సిద్ధం చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు అన్నారు. ఓటరు జాబితా రూపకల్పన ప్రక్రియ నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మాట్లాడు తూ, ఓటర్ల జాబితా తప్పులతడకగా ఉందని దాన్ని సరిచేయకుంటే ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారే అవకాశముందన్నారు. వెంటనే సరిచేయాలని కోరారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఈసీ నిబంధనల ప్రకారం ఏ ఒక్క ఓటరు తప్పిపోకుండా జాబితా రూ పొందిస్తున్నట్లుగా తెలిపారు. అభ్యంతరాలు, ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు విచారణ చేయిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, మేనేజర్, రెవె న్యూ అధికారి కళ్యాణ్, వెంకటేశ్ పాల్గొన్నారు.


