క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు
ఆదిలాబాద్: క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా గిరిజన క్రీడల అధికారి కోరెడ్డి పార్థసారథి అన్నారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా సబ్‌జూనియర్ అథ్లెటిక్ ఎంపిక పోటీలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోటీలు ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో ఆరోగ్యంతో పాటు విద్య, ఉ ద్యోగ రంగాల్లో రెండు శాతం రిజర్వేషన్ ఉంటుందన్నారు. ఈనెల 17, 18 తేదీల్లో ఆదిలా బాద్‌లో తొలిసారిగా నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు సాధించాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కా ర్యదర్శి రాజేశ్, డీవైఎస్‌వో శ్రీనివాస్, కోచ్‌లు, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.


