తుది దశకు కాంగ్రెస్ కార్యవర్గం ఎంపిక
అధిష్టానానికి చేరిన జాబితా జిల్లా ముఖ్య నేతలంతా హైదరాబాద్‌లోనే మకాం 8లోగా జిల్లా, 15లోగా మండల కమిటీలు
సాక్షి,ఆదిలాబాద్: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)కార్యవర్గం ఎంపిక తుది దశకు చేరుకుంది. పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు కలిసి తయారు చేసిన జా బితా అధిష్టానానికి చేరింది. ఇటీవల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆశావహుల నుంచి ద రఖాస్తులు స్వీకరించారు. పీసీసీ నియమావళి ప్ర కారం పార్టీలో నిబద్ధత గల కార్యకర్తలకు తొలి ప్రాఽ దాన్యత ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నా యి. పాత వారితో పాటు కొత్త నాయకుల్లో సమర్థులు, పార్టీ కోసం పనిచేసే వారిని పరిగణలోకి తీసుకొని జాబితా తయారు చేసినట్లు చెబుతున్నారు. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత అధిష్టానం ఆమోద ముద్ర వేస్తుందని పేర్కొంటున్నారు.
ఈనెల 8లోగా జిల్లా కమిటీ కార్యవర్గం పూర్తి చేయాలని పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఆ దేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆశావహుల నుంచి స్వీకరించిన దరఖాస్తులు అన్నింటినీ పరి శీలించి అధిష్టానానికి సోమవారం జాబితా అందజేశారు. ఇదివరకే జిల్లా నుంచి కార్యవర్గ కూర్పునకు సంబంధించి పేర్లను పంపించినప్పటికీ పలు జిల్లా ల నుంచి పూర్తి స్థాయి వివరాలు రాకపోవడంతో అఽ దిష్టానం మరికొంత సమయం ఇచ్చి వాటన్నింటిని పూర్తి చేయాలని జిల్లా పరిశీలకులు, అధ్యక్షులకు ఆ దేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి జాబితాను పరిశీలన చేసి అధిష్టానానికి అందజేశారు.
పట్టణ, మండల కమిటీలపై ఆసక్తి
జిల్లా కార్యవర్గంలో ముఖ్య నేతల అనుచర గణానికి సంబంధించి కూర్పు జరిగిందని, దీనిపై ఎవరికి అభ్యంతరాలు ఉండకపోవచ్చని జిల్లా పరిశీలకులు, అధ్యక్షులు పేర్కొంటున్నారు. అయితే కమిటీ ప్రకటన తర్వాత పార్టీ శ్రేణుల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందనేది వేచి చూడాల్సిందే. పట్టణ, మండల కమిటీలపై ఈనెల 10 నుంచి 15 వరకు కసరత్తు జరగనుంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు ముందుండగా, పట్టణ అధ్యక్షులు, కార్యవర్గం ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తి నెలకొంది. జిల్లా ముఖ్య నేతల అనుచరులు పలువురు పట్టణ అధ్యక్ష స్థానాన్ని ఆశిస్తున్నారు. తీవ్ర పోటీ నెలకొనడంతో ఆదిలాబాద్ పట్టణ కమిటీ కూర్పు కోసం పరిశీలకులు తీవ్ర కసరత్తు చేయాల్సిన పరిస్థితి. ఇక మండల కమిటీల్లో అధ్యక్ష స్థానం కోసం కూడా పోటీ కనిపిస్తోంది. దీంతో అన్ని వర్గాలను సమతూకం ఎలా చేయాలనే విషయంలో తర్జనభర్జన నెలకొంది. నియోజకవర్గ ఇన్‌చార్జీలు, మండలాల్లో ముఖ్య నేతలు తాము సూచించిన వారిని మండల కమిటీల్లో తీసుకోవాలని ఒత్తిడి తెస్తుండడంతో కమిటీ కూర్పు పరిశీలకులకు సవాలుగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు ముందుండగా, ఈ కమిటీలతో ఎలాంటి భేదాభిప్రాయాలు ఏర్పడుతాయోననే సందేహాలు పరిశీలకుల్లో వ్యక్తమవుతున్నాయి. పాత కమిటీల్లో ఉన్నవారిని పూర్తిగా మార్చి కొత్త కమిటీల్లో కొత్త ముఖాలను తీసుకోనున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తుది దశకు కాంగ్రెస్ కార్యవర్గం ఎంపిక
తుది దశకు కాంగ్రెస్ కార్యవర్గం ఎంపిక


